మొబైల్ ప్రపంచంలో సంచలనం రేపిన చైనా మొబైల్ మేకర్ షియోమి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ దుమ్మురేపుతోంది. మొన్నటికి మొన్న టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ ను రిలీజ్ చేస్తోంది. రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్ అతి త్వరలోనే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.
ఈ వాషింగ్ మెషీన్ ధర దాదాపు రూ.8,150 ఉండబోతోంది. చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 9 నుంచి అందుబాటులోకి రానున్న ఈ వాషింగ్ మెషీన్‌లు భారత్ మార్కెట్‌లోకి ఎప్పుడు రానున్నాయి అనే విషయం ఇంకా తెలియలేదు. అయితే కంపెనీ వీటిని ఇండియా మార్కెట్‌లోకి తీసుకువస్తుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇండియాలో ఇది 9వేల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. హై ఎండ్ ధర రూ. 22వేల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌గా.. సింపుల్ డిజైన్‌తో తెలుపు రంగులో ఉండే ఈ మెషీన్... యాంటీ కొరోషన్ మెటల్ బాడీని కలిగి ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇందులో సెల్ఫ్ క్లీనింగ్ డ్రై ఫంక్షన్, 10 గ్రేడ్ వాటర్ లెవెల్ అడ్జస్ట్‌మెంట్, 10 రకాల వాషింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని సామర్థ్యం 8 కేజీలుగా ఉంది. అలాగే 9 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగానే ఉంటుందని అంచనా.
కాగా మార్కెట్లో 6.5 కేజీల సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషిన్ ధరలు కూడా రూ.16 వేలకు తక్కువ ఉండవు. అదే మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ.20 వేలు పెట్టాల్సిందే. డబుల్ బ్లాక్ డిజైన్, స్ట్రాంగ్ వాటర్ బ్రో, ఎలాంటి మరక అయినా తొలగిస్తోంది. దుస్తుల రకాలను బట్టి వాషింగ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. తక్కువ నీళ్లతో ఎక్కువ ఉతుకు, ఆటోమేటిక్ డ్రై ఉందని కంపెనీ ఘనంగా ప్రచారం చేస్తోంది
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ షియోమి ఇండియా చైనా à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± ఆటోమేటికౠవాషింగౠమెషీనౠరెడà±â€Œà°®à±€ à°«à±à°²à±à°²à±€ ఆటోమేటికౠవాషింగౠమెషీనà±â€Œ వాషింగౠమెషీనà±â€Œ